MDCL: బోడుప్పల్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో 53వ రోజు రామకృష్ణ నగర్, ఇందిరానగర్ కాలనీలలో భారీ వెక్టర్ కంట్రోల్ కార్యక్రమాలు నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ శైలజ ప్రజలు వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వారానికి ఒక రోజు డ్రైడే పాటించాలని సూచించారు. చెరువుల శుభ్రత, లార్వా నివారణ, ఫాగింగ్ పనులు కొనసాగుతున్నాయి.