కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పలు గ్రామాల్లో పార్టీ జెండాలు ఎగురవేసి మిఠాయిలు పంచుకున్నారు. మండల అధ్యక్షుడు వజీర్ శివాజీ రావు మాట్లాడుతూ.. రాబోయే కాలంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని అన్నారు. కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.