AKP: భూ వివాదాల పరిష్కారానికి రీసర్వే దోహదపడుతుందని అచ్యుతాపురం మండల సర్వేయర్ దిలీప్, వీఆర్వో రొంగల నాయుడు అన్నారు. ఇవాళ అచ్యుతాపురం మండలం మడుతూరు గ్రామ రెవెన్యూ పరిధిలో 149 సర్వే నెంబర్లో రీ సర్వే ప్రారంభించారు. రైతులు రీసర్వేకు సహకరించాలని కోరారు. ఈ సర్వే అనంతరం రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.