KMR: అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ ఉపకార వేతనాలకు 11 మంది విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ తెలిపారు. బీఎస్సీ ఎంపీసీ నుంచి స్పందన, అనురాధ, పూజిత,వెన్నెల, ఎల్.అఖిల, ఆగ్నేయ, ఏ.అఖిల, బీఏ ప్రథమ సంవత్సరం నుంచి వైష్ణవి, దివ్య, భార్గవి, చరణ్య ఎంపికైనట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ప్రతి సంవత్సరం రూ.30 వేల చొప్పున ఉపకార వేతనం లభిస్తుందని పేర్కొన్నారు.