SDPT: బెజ్జంకి మండలంలో రేపు జరగనున్న శకటోత్సవ కార్యక్రమం సందర్భంగా ఎడ్ల బండ్లు, లేదా ఇతర వాహనాలు నడిపే వారు తప్పనిసరిగా నియమాలను పాటించాలని ఎస్సై హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపినట్లయితే కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. గ్రామస్తులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి శాంతియుతంగా ఉత్సవాలు జరగడానికి అందరూ సహకరించాలని కోరారు.