NDL: బేతంచర్ల పట్టణంలో సత్రం సమీపంలో నాపరాళ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఇవాళ ఉదయం ప్రమాదవశాత్తు బోల్తా పడింది. బనగానపల్లె నుంచి అయ్యల చెరువుకు వెళుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను వివరించారు.