SKLM: హిరమండలం పోలీస్ స్టేషన్కు నూతన ఎస్సైగా Y. మధుసూదన్ రావు సోమవారం బాధ్యతలు చేపట్టారు. హిరమండలంలో పనిచేస్తున్న వి.హేమంత్ కళ్యాణ్ ఆకస్మిక బదిలీ కారణంగా మధుసూదన్ రావు నియామకం జరిగింది. ఈ మేరకు ఎస్సై మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆయనకు పోలీస్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.