NTR: కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటివరకు 256 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు సీఐ కొండలరావు తెలిపారు. వీరిలో 200 మందిని కోర్టులో హాజరుపరచగా, ఒక్కొక్కరికి రూ.10 వేల జరిమానా విధించినట్లు ఆయన పేర్కొన్నారు.