JN: కొడకండ్ల మండల కేంద్రంలో అక్రమంగా నిల్వ ఉన్న గ్యాస్ సిలిండర్లను ఇవాళ పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా నిల్వ చేసి, రీఫిల్లింగ్ చేస్తున్నారని సమాచారం మేరకు జనగామ డీటీసీఎస్ లచ్చు నాయక్, AR ఎస్సై అశోక్, కొడకండ్ల ఎస్సై రాజు, పోలీస్ సిబ్బంది సంయుక్తంగా తనిఖీ చేసి 20 సిలిండర్లు స్వాధీనం చేసుకుని 15 మందిపై కేసులు నమోదు చేశారు.