KMM: భాగ్యనగర్ తండా పంచాయితీ కార్మికుడు దసనియా రాంసింగ్ ఇటీవల హఠాన్మరణం చెందగా, ఆయన దశదిన కార్యక్రమం సందర్భంగా తోటి కార్మికులు మానవత్వాన్ని చాటుకున్నారు. మేమంతా ఒక్కటే అనే భావనతో, సహచరులు అందరూ కలిసి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. ఈ సందర్భంగా రాంసింగ్ కుటుంబ సభ్యులకు రూ.5,000 నగదు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.