NRPT: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కోస్గిలో విషాదాన్ని నింపింది. ఉపాధి కోసం 13 ఏళ్లుగా కువైట్లో ఉంటున్న నారాయణపేట జిల్లా కోస్గి మండలం మల్రెడ్డిపల్లికి చెందిన సలీం పాషా (56) బాంబు పేలుడు ఘటనలో మృతి చెందారు. గత వారం ఆయన పని చేస్తున్న ప్రాంతంలో బాంబు పేలడంతో, దాని నుంచి వెలువడిన కెమికల్ ప్రభావంతో ఊపిరాడక చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.