AP: అనంతపురం జిల్లా తాడిపత్రిలో రేపు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఇవాళ మంత్రి పయ్యావుల కేశవ్ ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. అలాగే, ముద్దాలపురంలో పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 16 MLD నీటిశుద్ధి కేంద్రాన్ని ఇవాళ పయ్యావుల కేశవ్ ప్రారంభిస్తారు. ఈ నీటిశుద్ధి కేంద్రం ద్వారా లక్షా 20 వేల మందికి నీటి సరఫరా జరగనుంది.