గల్ఫ్ యుద్ధ ప్రభావం భారత మార్కెట్లపై తీవ్రంగా పడుతోంది. వంట నూనెల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కొన్ని నెలల క్రితం రూ.150 ఉన్న లీటర్ సన్‌ఫ్లవర్ ఆయిల్.. ఇప్పుడు బ్రాండ్‌ను బట్టి రూ.190 నుంచి రూ.202 వరకు పలుకుతోంది. వేరుశనగ నూనె లీటర్ రూ.220కి చేరగా, పామాయిల్ రూ.150, ఆవనూనె రూ.190కి పెరిగింది. దీనికి తోడు రూపాయి విలువ పతనం కావడం కూడా ధరల పెరుగుదలకు మరింత ఆజ్యం పోస్తోంది.