TG: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షలతోనే హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కారులో వెళ్తున్న యువకుడిని గుర్తుతెలియని దుండగులు టిప్పర్‌తో వెంబడించి ఢీకొట్టారు. ఆ యువకుడు తీవ్రంగా గాయపడటంతో రాళ్లతో కొట్టి చంపారు. హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.