KNR: మొదటి అదనపు జిల్లా & సెషన్స్ కోర్టు ప్రాంగణంలో ఇవాళ వాహనాల వేలం నిర్వహించనున్నారు. స్వాధీనం చేసిన ఆటోరిక్షా (TS02UC6055), ద్విచక్ర వాహనం (TS02UA7746)ను బహిరంగ వేలంలో విక్రయించనున్నారు. వాహనాలను టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ముందుగా పరిశీలించవచ్చు. ఆసక్తి గల వారు నేరుగా హాజరై నిబంధనల ప్రకారం వేలంలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు.