ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లలో జపాన్‌కు చెందిన ‘మియాజాకి’ మామిడి ప్రఖ్యాతి గాంచింది. దీన్ని ‘ఎగ్ ఆఫ్ ది సన్'(సూర్యుని గుడ్డు) అని కూడా పిలుస్తారు. ఈ మామిడి ముదురు ఎరుపు, ఊదా రంగుతో కనిపిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో కిలో రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఉంటుంది. అంటే ఈ ఒక్క కిలో మామిడి ధరతో మన దేశంలో ఒక లగ్జరీ బైక్ లేదా సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేయొచ్చు.