WNP: పెద్దగూడెం గ్రామ శివారులోని డబల్ బెడ్ రూమ్ గృహంలో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల ప్రకారం బ్లాక్ నెంబర్ 31 లోని రూమ్ నెంబర్ 202 లో కొందరు వ్యక్తుల పేకాట ఆడుతున్నారని సమాచారంతో రూరల్ ఎస్సై రిషికేష్ తన సిబ్బందితో కలిసి దాడి చేశారు. వారి నుండి రూ.36,030 నగదు, 8 ఫోన్లు,5 బైకులు,104 పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నారు.