KNR: గన్నేరువరం మండలంలోని జంగాపల్లి సబ్ స్టేషన్లో నూతన పవర్ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేస్తున్నందున శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనుంది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు జంగాపల్లి, పీచుపల్లి, గోపాల్పూర్, హనుమాజిపల్లి, మాదాపూర్ గ్రామాలకు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ ఆంజనేయులు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.