AP: ఢిల్లీలో కేంద్ర రవాణాశాఖ కార్యదర్శిని మంత్రి బీసీ జనార్ధన్ కలిసి రాష్ట్రంలోని హైవే పనుల వేగవంతంపై చర్చించారు. పెండింగ్ సమస్యలను టాస్క్ ఫోర్స్ కమిటీ ద్వారా పరిష్కరిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా బనగానపల్లెలో 2 లేన్ల రోడ్డును 4 లేన్లుగా మార్చాలని విజ్ఞప్తి చేశారు. హైవేల అభివృద్ధి, విస్తరణపై తాము ఇచ్చిన ప్రతిపాదనలకు కేంద్రం సానుకూలంగా స్పందించిందని మంత్రి వెల్లడించారు.