ASR: అరకులోయ మండలం లండిగుడ గ్రామంలో రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను డా. సియ్యారి దున్న దొర గురువారం పంపిణీ చేశారు. రైతులు అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సేవలను వారి వద్దకే తీసుకువచ్చామని తెలిపారు. పూర్తి స్థాయి సర్వే, ఫోటోలతో పాస్ పుస్తకాలు అందిస్తున్నామని చెప్పారు. ఇందులో టీడీపీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.