మారుతీ సుజుకీ తన సర్వీస్ నెట్వర్క్ను రికార్డు స్థాయిలో విస్తరించింది. ఒక్క ఏడాదిలోనే 502 కొత్త సర్వీస్ కేంద్రాలను ప్రారంభించి, దేశవ్యాప్తంగా మొత్తం సంఖ్యను 5,926కు చేర్చింది. వినియోగదారులకు మరింత చేరువ కావడమే లక్ష్యమని సంస్థ తెలిపింది. 2031 నాటికి ఈ కేంద్రాలను 8,000కు పెంచాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. గత మార్చితో పోలిస్తే అమ్మకాలు కూడా 5 శాతం పెరిగాయి.