అన్నమయ్య: మదనపల్లె రూరల్ మండలం బెస్తపల్లిలో చింత చెట్లను అనుమతి లేకుండా నరుకుతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పార్టీ నాయకుడు వందల ఏళ్ల ప్రాచీన చెట్టును కూడా అనుమతులు లేకుండా నరిపించాడని ఆరోపించారు. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడం పట్ల మండిపడ్డారు. సంబంధిత రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.