గుంటూరు రైల్వే డివిజన్ మీదుగా నడిచే పలు ప్రత్యేక రైళ్లకు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రత్యేక రైళ్లను రెగ్యులర్ రైళ్లుగా మార్చేందుకు అధికారికంగా ఆమోదం తెలిపింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రైళ్లు ఎప్పటి నుంచి రెగ్యులర్గా నడుస్తాయనే తేదీలను త్వరలో వెల్లడించనున్నారు.