HNK: ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్ వద్ద వడదెబ్బ తగిలి ఓ మహిళ వ్యవసాయ కూలీ శుక్రవారం మృతి చెందింది. భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగపూర్కు చెందిన బరిగెల శోభ స్థానిక కూలీలతో కలసి వ్యవసాయ కూలీ పనికి ఎల్కతుర్తి మండలం కోతులనడుమకు వెళ్లింది. పని ముగించుకుని తిరిగి వస్తుండగా ట్రాక్టర్లోనే వడదెబ్బతో కుప్పకూలి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.