AP: మూడు రాజధానులను మాజీ సీఎం జగన్ మరోసారి ప్రస్తావించారు. దీనికి మంత్రి నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ ఆర్థిక రాజధాని అన్న విశాఖలో తమ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో అక్కడి ప్రజలు గెలిపించారని గుర్తు చేశారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో తమ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చిందన్నారు.