HNK : హన్మకొండ నగరంలోని వేయి స్తంభాల ఆలయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.14.40 కోట్లను కేటాయించడంతో ఇప్పుడు రాజకీయ రగడ నెలకొంది. నిధులు తమ వినతిపత్రం వల్లే వచ్చాయని కాంగ్రెస్ ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. దీనికి ప్రతిగా బీజేపీ నాయకులు ఆలయాన్ని సందర్శించి, అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వమే కట్టుబడి ఉందని పేర్కొన్నారు.