HYD: నగరంలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు రూ.150 కోట్లతో విస్తరణ పనులు చేపట్టామన్నారు. హైదరాబాద్ కేబీఆర్ పార్కు చుట్టూ అండర్ పాస్‌లు, వంతెనల నిర్మాణ పనులు జరుగుతుండడంతో ట్రాఫిక్ ఇబ్బందులను సీపీ సజ్జనార్‌తో కలిసి పరిశీలించారు.