అఫ్గన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అతడు గత కొంతకాలంగా దీర్ఘకాలిక వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. 2023లో ఆపరేషన్ తర్వాత మళ్లీ మైదానంలోకి వచ్చినప్పటికీ.. టెస్ట్ క్రికెట్ ఆడటం వల్ల వెన్నుపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. వైద్యులు సలహా మేరకు టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పాలనుకుంటున్నట్లు తెలిపాడు.