KDP: దువ్వూరు మండలంలోని చల్లబసాయపల్లెలో నూతనంగా నిర్మించిన రైతు సేవా కేంద్రం,హెల్త్ క్లినిక్‌ను ఇవాళ ఉదయం 8 గంటలకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రారంభించనున్నట్లు MPP కానాల జయచంద్రారెడ్డి సోమవారం తెలిపారు. MPతోపాటు మైదుకూరు మాజీ MLA శెట్టిపల్లె రఘురామిరెడ్డి, మాజీ DY CM అంజాద్ బాషా, YCP జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి పాల్గొంటారన్నారు.