అంజీర పండ్లతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలోని పోషకాలు అనేక సమస్యలకు చెక్ పెడతాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం సమస్య తగ్గుతుంది. పొటాషియం రక్తపోటును నియంత్రించి గుండెను పదిలంగా ఉంచుతుంది. కాల్షియం పుష్కలంగా ఉండటంతో ఎముకలు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. వీటిని తింటే బరువు నియంత్రణలో ఉంటుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది.