KNR: ఇల్లందకుంట మండల ప్రజలకు వైకుంఠ రథం సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు సర్పంచ్ ధార సురేశ్ తెలిపారు. గతంలో మరమ్మతుల లోపంతో నిరుపయోగంగా ఉన్న రథాన్ని మండల సర్పంచ్ సూచన మేరకు MPDO రాజేశ్వరరావు అనుమతితో పునరుద్ధరించారు. ఇకపై అవసరమైనప్పుడు వైకుంఠ రథాన్ని మండల ప్రజలు గ్రామ పంచాయితీ కార్యాలయం తరఫున ఈ సేవను ఉపయోగించుకోవాలని కోరారు.