NTR: మాజీ మంత్రి జోగి రమేశ్‌పై తెలంగాణలోని ఫిలింనగర్ PSలో కేసు నమోదైంది. ఓ మీడియా సంస్థ కార్యాలయంపై జోగి సహా 19 మంది వైసీపీ నాయకులు దాడికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు నమోదు కాగా పోలీసులు BNS 351(2), r/w 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ నెల 7న సదరు మీడియా సంస్థ ఫిర్యాదు చేయగా నిన్న కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.