E.G: రాజమండ్రి శివారు ఆటోనగర్లో వాసిరెడ్డి బాబి చలివేంద్రాన్ని శుక్రవారం అమలాపురం వైసీపీ పార్టీ పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి ప్రారంభించారు. కార్మికుల దాహార్తిని తీర్చడం కోసం చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆమె వెల్లడించారు. కార్మికులకు ఎల్లప్పుడూ వైసిపి పార్టీ అండగా ఉంటుందన్నారు.