దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం క్రమంగా పెరుగుతోంది. మార్చి నెలలో 10 నెలల గరిష్ఠాన్ని తాకింది. వినియోగదారుల ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో 3.40 శాతానికి పెరిగింది. ఇది ఫిబ్రవరిలో నమోదైన 3.21 శాతం కంటే అధికం. ఆహార పదార్థాల ధరలు పెరగడం వల్లనే రిటైల్ ద్రవ్యోల్బణం పుంజుకుంది. ముఖ్యంగా టమోటాలు, క్యాలీఫ్లవర్, ఆభరణాల ధరలు ఎక్కువ ప్రభావం చేశాయి.