NGKL: కల్వకుర్తిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రారంభించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ సంజీవ్ యాదవ్, బృంగి ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.