SDPT: వేసవి తీవ్రత దృష్ట్యా వడదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు వైద్య ఆరోగ్య శాఖ సూచనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ కె.హైమావతి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట కలెక్టరేట్లో ఆరోగ్య శాఖ రూపొందించిన అవగాహన గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. జిల్లాలో ఎండలు, వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.