VKB: నేపాల్ రాష్ట్రం కాఠ్మాండూలో ఇటీవల జరిగిన షూటింగ్ బాల్ టోర్నమెంట్ జాతీయ పోటీలో మోయిజ్ సత్తా చాటి గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ సందర్భంగా సోమవారం తాండూరు ముస్లిం వెల్ఫేర్ స్కిల్ డెవలప్మెంట్ సోసైటీ ఆధ్వర్యంలో మోయిజ్ను ఘనంగా సన్మానించారు. సోసైటీ అధ్యక్షులు కమల్ అతహర్ మాట్లాడుతూ.. తాండూరుకు గోల్డ్ మెడల్ తెచ్చిపెట్టడం గర్వకారణమని ప్రశంసించారు.