AP: బలవంతపు మతమార్పిడికి పాల్పడితే ఐదేళ్ల జైలుశిక్ష తప్పదని, SC, STలను మారిస్తే అది పదేళ్లు అవుతుందని రఘురామకృష్ణరాజు హెచ్చరించారు. 13 రాష్ట్రాల్లో ఉన్న ఈ చట్టం ఏపీలోనూ అమలు కావాలన్నారు. ఒక మతంలో ఉంటూ మరో మతం రిజర్వేషన్లు పొందడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు. అమాయక ఎస్సీలను మోసం చేయవద్దని, క్రిస్టియన్లకు SC, ST కేసులు పెట్టే హక్కు లేదని ఆయన పేర్కొన్నారు.