హన్మకొండ మండలం కొమటిపల్లి గ్రామ శివారులోని మధు తండాలో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ చేసినట్లు సమాచారం మేరకు సోమవారం టాస్క్ ఫోర్స్, కేయూ పోలీసులు సయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా 130 బస్తాలు (65 క్వింటాళ్లు) పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా బియ్యాన్ని నిలవచేస్తున్న పోరిక కమలపై కేసు నమోదు చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఎసీపీ మధుసూదన్ వెల్లడించారు.