KMR: కామారెడ్డికి చెందిన డా. నాగపూరి రాజును కేంద్ర సినిమా సెన్సార్ బోర్డు సలహా మండలి సభ్యునిగా హైదరాబాద్ ప్రాంతానికి నియమిస్తూ సమాచార మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా, కళా రంగాల్లో సేవలందించిన ఆయన ప్రస్తుతం సంస్కార భారతి జిల్లా సంయుక్త ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన నియామకంపై పలువురు అభినందించారు.