BDK: భద్రాచలం ఐటీసీ కాంట్రాక్ట్ కార్మికుల రిలే నిరాహార దీక్ష నేటితో 19వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో BRS రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి కార్మికులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. కార్మికుల న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంఛార్జ్ పాల్గొన్నారు.