MDK: పెద్ద శంకరంపేట తిరుమలాపూర్లో రజకుల స్మశాన వాటిక స్థలాన్ని కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని రజక సంఘం డిమాండ్ చేసింది. తహశీల్దార్ ప్రభుదాస్‌కు వినతిపత్రం అందజేశారు. సర్వే నంబర్ 237 ఎంతో కాలంగా రజకులు స్మశానవాటిక ఏర్పాటు చేసుకున్నారని, కొంత మంది అక్రమంగా కబ్జా చేస్తున్నారని అధికారులు స్పందించి న్యాయం చేయాలని తహశీల్దార్‌కు వినతి చేశారు.