JGL: మేడిపల్లి మండల కేంద్రంలో మార్క్ ఫెడ్ సౌజన్యంతో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రైతులు పండించిన పంటను దళారులకు అమ్మవద్దన్నారు. రైతులు పండించిన పంటలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలలోనే అమ్మాలని సూచించారు.