VKB: ఎస్సీ సబ్ ప్లాన్ 2025-26సంవత్సరానికి గాను డెయిరీ ఫార్మ్ నిర్వహించేందుకు SC రైతులు దరఖాస్తు చేసుకోవాలని MPDO జైపాల్ రెడ్డి సూచించారు. SC సేవా సహకార అభివృద్ధి సొసైటీ లిమిటెడ్ ద్వారా డెయిరీ ఫార్మ్ నిర్వహించుటకు రైతులకు సబ్సిడీ అందిస్తున్నారు. నిన్నటితో గడువు ముగియడంతో దానిని ఈనెల 16వ తేదీ వరకు పొడగించారు. ఆసక్తి గల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.