AP: సీఎం చంద్రబాబు ఇవాళ బాపట్ల జిల్లా సూరేపల్లిలో పర్యటించనున్నారు. ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా రైతులకు తప్పుల్లేని పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తారు. గత ప్రభుత్వ రీసర్వే లోపాలను సవరించిన కూటమి ప్రభుత్వం, ఈ ఏడాది ఇప్పటికే 22.79 లక్షల పుస్తకాలను పంపిణీ చేసింది. ఇవాళ జిల్లాలో మరో 3,658 మందికి అందజేయనున్నారు. అనంతరం రైతులతో సమావేశం అవుతారు.