AP: పేద ప్రజలకు దేవుడిచ్చిన వరం ‘ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్’ అని మంత్రి లోకేష్ కొనియాడారు. ఆ మహనీయుడి సేవాస్ఫూర్తికి జోహార్లు అర్పిస్తున్నానని పేర్కొన్నారు. అర్ధ శతాబ్దం క్రితం తెలుగునేలపై రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు ఆరంభించారని, విన్సెంట్ అనంతపురం ప్రజల ఆశాజ్యోతిగా వెలుగొందారన్నారు. ఆస్పత్రులు, విద్యాలయాలు, పక్కా గృహాల నిర్మాణంలో ప్రగతి ప్రదాతగా నిలిచారని తెలిపారు.