కేరళలో 140 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఉదయాన్నే తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈ ఫలితాలు మే 4న విడుదల కానున్నాయి. కాగా, ప్రస్తుతం పృథ్వీరాజ్ తెలుగులో మహేష్ బాబు ‘వారణాసి’ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు.