ఐశ్వర్య రాయ్‌తో విడాకులపై వస్తున్న వార్తలకు అభిషేక్ చెక్ పెట్టాడు. తాము విడిపోతున్నామనే ప్రచారాన్ని ఆయన ఖండించాడు. అలాగే, పురుషుల స్వభావంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘మగవారిలో భావోద్వేగాలు అడ్డురావడం వల్ల తండ్రులు మంచి టీచర్లు కాలేరు. మహిళలకు ఉన్నంత సున్నితత్వం పురుషులకు ఉండదు’ అని అభిప్రాయపడ్డాడు. దీంతో ఈ స్టార్ కపుల్ విడిపోతున్నారనే పుకార్లకు తెరపడింది.