అల్లరి నరేష్ హీరోగా ‘కనక దుర్గ’ అనే భక్తి మూవీ ప్రారంభమైంది. బి.వి.ఎస్ రవి కథను అందించగా, ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నాడు. కాజల్ చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ మూవీ పూజా కార్యక్రమాలు తాజాగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, సురేఖ కొణిదెల కెమెరా స్విచ్చాన్ చేసింది.