JN: పాలకుర్తి MLA యశస్విని రెడ్డి, TPCC ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం తొర్రూర్ మండల కాంగ్రెస్ నాయకులు హరిపిరాలలోని బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు. మాజీ MPTC జక్కా మహబూబ్ రెడ్డి, జక్కా ఇంద్రసేన రెడ్డి పాల్గొన్నారు.